![]() |
![]() |

బుల్లితెరపై హాస్య ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న కామెడీ షోల్లో శ్రీదేవి డ్రామా కంపనీ` ఒకటి. గత కొంత కాలంగా ఈటీవిలో ప్రసారం అవుతున్న ఈ షోని మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ లు అంతా ఈ షోలోనూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తమదైన స్కిట్ లతో ఆకట్టుకుంటూ నవ్విస్తున్నారు. ఈ షోకు `ఢీ` నుంచి బయటికి వచ్చిన పూర్ణ జడ్జిగా వ్యవహరిస్తుండగా .. యాంకర్ గా రష్మీ గౌతమ్ వ్యవహరిస్తోంది. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఈ షోలో సందడి చేస్తూ నవ్విస్తున్నారు.
ఈ ఆదివారం జూలై 3న 75వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే దీన్ని మరింత స్పెషల్ గా మార్చి నవ్వించడానికి అంతా సిద్ధమయ్యారు. ఈ షోకు హీరోయిన్ ఇషా చావ్లా గెస్ట్ గా హాజరై సందడి చేసింది. అయితే ఇదే షోలో సీనియర్ నటి అన్నపూర్ణ శ్రీవల్లిగా మారి ఆదితో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా విడుదల చేసిన ప్రోమో నెట్టింట సందడి ఏస్తోంది. ఈ షోలో `పుష్ప` స్ఫూఫ్ ని హైపర్ ఆది, అన్నపూర్ణమ్మ ఓ రేంజ్ లో రక్తికట్టించి కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు. `పుష్పా నేను శ్రీవల్లిని తగ్గేదే లే.. అని అన్నపూర్ణమ్మ అంటే .. ఏంటీ ఆయాసమా.. అంటూ హైపర్ ఆది పంచ్ వేశాడు.
ఆ తరువాత `శ్రీవల్లీ ముద్దేమైనా ఇత్తావా.. అని హైపర్ ఆది అంటే..ఇదుగో అన్నో నోనొచ్చి ఇచ్చేదా ముద్దు.. అని వర్ష్ అనడంతో .. హైపర్ ఆది మళ్లీ పంచ్ వేశాడు. ఇక ఇప్పటి దాకా నా అందం చెక్కు చెదరలేదు తెలుసా? అని అన్నపూర్ణమ్మ అంటుంటే.. మల్లెమాల చెక్కుల కోసం ఇలాంటి మాటలు చెప్పడానికి నీకేమైనా మనసుందా? అంటూ హైపర్ ఆది పంచ్ వేయడంతో అక్కడున్న వారంతా పడి పడి నవ్వేశారు. ఈ సందర్భంగా ఈ షోలో పాల్గొన్న ఇషా చావ్లాని 2011 నుంచి లవ్ చేస్తున్నానని చెప్పి షాకిచ్చాడు.. ఆ మాటలకు ఇషా చావ్లా ఎలా రియాక్ట్ అయింది?.. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే జూలై 3న ప్రసారం అయ్యే తాజా ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |